హరి యోగ నిద్రలో ఉంటాడని
నిద్రే యోగమనుకునే వారికీ
ఏమి చెప్పాలి?
మెల్ల మెల్లగా తమస్సు
జ్ఞానాన్ని తస్కరిస్తుంటే
అదే తపస్సనుకొనే వాడిని
ఎలా సంస్కరించాలి?
నీరసం లో చైతన్యాన్ని వెతుక్కునే వానికి,
చింత లో చిదానందం ఉందనుకునే వారికీ
ఏ ఉపదేశం చేయాలి?
తాను నేననుకొనే నేనులో
నేను లేని నేను కై
నిరంతరంగా నిరీక్షిస్తు,
అన్నిటిలో తానున్నానని తెలియని వానికి
ఏమని తెలియ చెప్పాలి?
Also read: యుగసంధి
Also read: విజేతలు
Also read: పూలవాడు
Also read: రాగాలు
Also read: జీవితం