ఉపనిషత్తులకు ప్రతినిధులమైనా
మా గాధ లన్నీ “కఠినోపనిషత్తులే”
అగ్రహారాలు అడుగంటి పోయాక
అగ్ర వర్ణానికి విలువేముంది ?
జగమెరిగిన బ్రాహ్మణునికి జందమేల
మనమెరిగిన బాపనయ్యకి అందలమేల ?
మా జంధ్యాలన్నీ పశ్చిమానికి పారిపోయాక
ఉన్న జంధ్యాలకీ సంధ్యా సమస్య లే
అగ్ర కులమే కాని
అసెంబ్లీ లో కుర్చీ
ఉండదు !
ప్రభుత్వాల డేగ కన్నులన్నీ
దేవాదాయం మీదే !
వాడి రతి కో,వీడి చితి కో
మంత్రాలు రాల్చి
మనుగడ
సాగిస్తుంటాం !
ఇక్కడ జంధ్యాలన్నీ
ఏవో విశ్వాసాల్ని ముడివేసుకుంటూ
రాలని చింత కాయల మంత్రాలై
ఇల వేలుపు
మొక్కిన వరమీయని
వేల్పయినపుడు
శిధిలాలయాలకు పూజారులు గా
కాక
ఇంకెలా మిగులుతాం ?
Also read: అర్ధ రాత్రి స్వతంత్రం
Also read: నాణానికి మూడో వైపు
Also read: గీటురాయి
Also read: నిర్వికార సాక్షి
Also read: దేవుడా రక్షించు నా దేశాన్ని!
Truly said, this poem depicts the sad state of pujaris and poor Brahmins,