అప్పుడతను ఎప్పుడు పాడిన
మేఘమల్హర్ రాగమే!
అమె చుట్టూ తాగి తూగే తోయధారలా
అటూ ఇటూ తిరిగే వాడు.
అవును మరి, ఆమె మెరుపుతీగలా ఉండేది.
ఇదంతా ఓ ముఫై ఏళ్ల నాటి సంగతి.
ఇప్పుడో… ఆమే ఓ పిప్పిళ్ల బస్తా…
ఆమె కనిపిస్తే అతను తల తిప్పుకుని ప్రక్కకు తప్పుకొంటాడు.
అయితే ఒకటి మాత్రం నిజం…
అప్పుడప్పుడు అతని గొంతు
అప్రయత్నంగా ముఖారి ఆలపిస్తుంటుంది.
Also read: జీవితం
Also read: సముద్రం
Also read: కాలెండర్
Also read: కూలి
Also read: ప్రళయం