జీవితంలో…
ఎన్నో పలకరింతలు,
ఎందరితోనో పరిచయాలు,
కొందరితో బహుదూర ప్రయాణాలు…
కొన్ని మరచిపోలేని ప్రణయ భావనలు,
స్నేహాలు, సరదాలు, హస్యాలు, నవ్వుల జల్లులు,
అప్పుడప్పడు ఎవడితో ఒకడితో తప్పని శత్రుత్వాలు,
తగవులు, బాధలు, భయాలు,
నిద్రలేని రాత్రులు, కలలు, కలవరింతలు…
ఎన్నో, ఎన్నెన్నో, వందలు, వేలు!
కానీ కొందరిని చూసినప్పుడే అనిపిస్తుంది
మనం పోయినప్పుడు చూడడానికి వస్తారని
…రెండు కన్నీళ్లు కారుస్తారని!
Also read: సముద్రం
Also read: కాలెండర్