భారతీయ ఆంగ్ల కవులు-9
రేష్మా రమేష్ దేశ విదేశాల్లో తన కవితలు వినిపించిన ప్రతిభాశాలి. తన కవితలు దేశంలోనూ వేలుపలా అనేక భాషల్లోకి తర్జుమా చేయ బడ్డాయి. “స్మాల్ హాండ్స్ అఫ్ శివకాశి’ అనే కవితలో చిన్న పిల్లలు టపాకాయలు తయారు చేసే వృత్తిలో హానికరమైన రసాయనాలు వాడడం చూసి బాధ పడుతుంది. జనం ఈ టపాకాయలు వాడడం ద్వారా బాల కార్మిక వ్యవస్థను పోషించిన్ వాళ్ళవుతున్నారు. మరి కొన్ని కవితలలో ఈ రచయిత్రి ఒంటరితనంతో, తీరని కోరికలతో మూగ బోయినట్లుగా అనిపిస్తుంది. “ఒలింపస్” అనే కవితలో తనకు అన్నీ ఎంతో ఇష్టమైనవి దొరుకుతాయి. తన హృదయం వాటిని వదలి రాకూడదంటారు. ‘అరచేతిలో నదిని మడచి పెట్ట’మనడం, తన ‘ఛాతీపై కొండ నిద్ర లేవడం’ లాoటి భావోద్వేగాలు తన కవిత్వంలో కనుపిస్తూ ఉంటాయి.
Also read: త్రిషాని దోషి
Also read: అరుంధతీ సుబ్రహ్మణ్యం
Also read: జీత్ తాయిల్
Also read: శివ్ కె కుమార్
Also read: కేకి దారూవాలా
Also read: జయంత్ మహాపాత్ర
Also read: నిస్సిం ఎజేకియల్
Also read: ఎకె రామానుజం