కోల్ కతా: ప్రముఖ హిందీ టీవీ ఛానల్ ఇండియా టీవీ తో కలసి పీపుల్స్ పల్స్ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ లో పశ్చిమ బెంగాల్ లో బీజేపీకి 172 నుండి 192 , త్రిణమూల్ కాంగ్రెస్ పార్టీకి 64 నుండి 88 , లెఫ్ట్ ఫ్రంట్ కి 7 నుండి 12 సీట్స్ లభించే అవకాశం కనిపిస్తోంది.
ఇండియా టీవీ – పీపుల్స్ పల్స్ సంస్థ నిర్వహించిన ఎగ్జిట్ పోల్ సర్వేకు సంస్థ డైరెక్టర్ డాక్టర్ సజ్జన్ కుమార్ నాయకత్వం వహించారు. ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాల దృష్ట్యా ఎనిమిది దశలలో జరిగిన ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ ప్రప్రథమంగా పశ్చిమ బెంగాల్ పైన కాషాయ జెండాను ఎగురవేయబోతున్నదని నిశ్చయంగా చెప్పవచ్చు. 2016లో జరిగిన ఎన్నికలలో బీజేపీ మూడు స్థానాలు గెలుచుకున్నది.
బెంగాల్ ఎన్నికలలో బీజేపీ పార్టీ విజయానికి ప్రధాన కారణం ప్రజలు హిందూ , ముస్లిం సామాజికి వర్గాలుగా విడిపోవడం తో పాటు స్థానిక త్రిణమూల్ నాయకుల అవినీతి , అక్రమాలు , రౌడీయిజం.
త్రిణమూల్ కాంగ్రెస్ నుంచి పెద్ద నాయకుడు చాలామంది బీజేపీలో ప్రవేశించారు. ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరిగింది. ప్రధాని నరేంద్రమోదీ, హోమంత్రి అమిత్ షా, పార్టీ అధ్యక్షుడు నడ్డా నిర్విరామంగా బీజేపీ తరఫున ప్రచారం చేశారు. నందిగ్రామ్ నుండి బరిలో నిలిచిన మమతా బెనెర్జీ ఆ నియోజకవర్గంనుండి ఓడిపొయ్యే అవకాశాలు అధికంగా ఉన్నాయి.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో పీపుల్స్ పల్స్ సంస్థ దాదాపు మూడు సార్లు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు పర్యటించి సర్వే నిర్వహించింది .బెంగాల్ రాష్ట్రంలో ఎవరితో మాట్లాడినా రాష్ట్ర రాజకీయాల్లో పరివర్తన వస్తుంది అన్ని స్పష్టంగా తేల్చినారు. బెంగాల్ రాష్ట్రంలో ప్రజలు మార్పును కోరుకుంటున్నారు.
2019 పార్లమెంట్ ఎన్నికలలోనే బెంగాల్ ప్రజలు మార్పు దిశగా , బీజేపీ పార్టీ వైపు అడుగులు వేయడం ప్రారింభించారు. మొత్తం 42 లోక్ సభ స్థానాలలోనూ బీజేపీ 19 స్థానాలు గెలుచుకున్నది.