మంచిర్యాల: ఏప్రిల్ 1నుంచి కేంద్రం అమలు చేయనున్న 4 కోడ్ ల ప్రతులను దహనం చేయడానికి కార్మిక సంఘాలు నిర్ణయించాయి. 44 కార్మిక చట్టాలను 4 చట్టాలుగా మారుస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టారు. అయినా కేంద్రం నిర్ణయం ను మార్చుకోలేదు.. ఈ ఏప్రిల్1నుంచి 4 కోడ్ లు అమలు కానున్నాయి. పూర్తిగా కార్మిక సంఘాల కు కార్మికులకు ఈ కోడ్ ల వల్ల తీవ్ర నష్టం కలిగించనున్నాయి. దేశవ్యాప్తంగా ఈ ఆందోళనలు చేపట్టారు అని సింగరేణిలోనూ 4 కోడ్ ల ప్రతులను కాల్చి నిరసన తెలపాలని ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి వాసిరెడ్డి సీతారామయ్య కార్మికులకు విజ్ఞప్తి చేసారు.
Also Read: కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలతో సింగరేణి ఎస్సీ, ఎస్టీ అసోసియేషన్ ప్రతినిధుల భేటీ