* తొలివన్డేలో శతకం చేజారిన శిఖర్
* రోహిత్ తో జంటగా ధావన్ హిట్
భారత సీనియర్ ఓపెనర్ శిఖర్ ధావన్ ను వన్డేల్లో 6వేల పరుగుల రికార్డు ఊరిస్తోంది. పూణే వేదికగా శనివారం జరిగే రెండోవన్డేలో సైతం ధావన్ దూకుడుగా ఆడగలిగితే ఆరువేల పరుగుల మైలురాయిని చేరడం ఏమంతకష్టంకాబోదు.
తొలివన్డేలో రోహిత్ శర్మతో కలసి భారత ఇన్నింగ్స్ ప్రారంభించిన శిఖర్ ధావన్ 98 పరుగులు చేసి…శతకానికి 2పరుగుల దూరంలో అవుటయ్యాడు. భారత్ 66 పరుగుల విజయం సాధించడంలో ప్రధానపాత్ర వహించడంతో పాటు…మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన ధావన్ మరో 94 పరుగులు చేయగలిగితే 6 వేల పరుగుల
రికార్డును అందుకోగలుగుతాడు.
ఒకవేళ్ల ధావన్ 6వేల పరుగుల రికార్డు పూర్తి చేయగలిగితే.ఈ ఘనత సాధించిన 10వ భారత క్రికెటర్ గా రికార్డుల్లో చేరనున్నాడు. భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ కేవలం 136 ఇన్నింగ్స్ లోనే 6వేల పరుగులు సాధించడం ద్వారా అత్యంతవేగంగా ఈ రికార్డు చేరిన ఏకైక క్రికెటర్ గా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇప్పటి వరకూ ఆడిన 137 ఇన్నింగ్స్ ఆడిన ధావన్ 5వేల 906 పరుగులు నమోదు చేశాడు.
Also Read : భారత్-ఇంగ్లండ్ వన్డే సిరీస్ కు గాయాలదెబ్బ
ఇంగ్లండ్, బంగ్లాదేశ్ న్యూజిలాండ్ జట్లు మినహా మిగిలిన దేశాలపైన ధావన్ కు మూడంకెల స్కోర్లు ఉన్నాయి. ప్రస్తుత తీన్మార్ సిరీస్ లోని తొలివన్డే వరకూ 140 మ్యాచ్ లు ఆడిన శిఖర్ ధావన్ కు 17 శతకాలు, 31 అర్థశతకాలు సాధించిన రికార్డు ఉంది.
వన్డే ఫార్మాట్లో భారత్ గత ఐదేళ్లుగా సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించడంలో కెప్టెన్ కొహ్లీ,వైస్ కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు శిఖర్ ధావన్ సైతం నిలకడగా రాణించడమే కారణమని విశ్లేకులు చెబుతున్నారు.