- ఎస్సీ, ఎస్టీల ల సమస్యల పరిష్కరించాలని వినతి
- పదవీ విరమణ వయసు పెంచాలని డిమాండ్
- ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయిన్ పల్లి వినోద్ కుమార్ తో భేటీ
తెలంగాణ కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలను మరియు బోయిన్ పల్లి వినోద్ కుమార్ ను సింగరేణి ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ ప్రతినిధులు కలిశారు. సింగరేణి ఎస్సీ ఎస్టీ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ అంతోటి నాగేశ్వరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ గోళ్ళ రమేష్ తో పాటు అసోసియేషన్ సభ్యులు హైదరాబాద్ లో పలువురు కోల్ బెల్ట్ ఎమ్మెల్యేలను, ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయిన్ పల్లి వినోద్ కుమార్ కలిశారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదవీ విరమణ వయస్సు 61 సంవత్సరాలకు పెంచిన నేపథ్యంలో సింగరేణి ఉద్యోగులకు కూడా పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.
2018 లో 665 ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టులకు సంబంధించి రాతపరీక్ష నిర్వహించి ఫలితాలను ప్రకటించకుండా హైకోర్టు ఆదేశాల ప్రకారం నిలిపివేశారని ఆ రాత పరీక్ష ఫలితాలను వెంటనే ప్రకటించాలని విజ్ఞాపన పత్రం అందజేశారు. అసోసియేషన్ ప్రతినిధులు ప్రణాళికా సంఘం వైస్ ఛైర్మన్ బోయిన్ పల్లి వినోద్ కుమార్ తో పాటు కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, ఇల్లందు ఎమ్మెల్యే శ్రీమతి హరిప్రియ నాయక్, బెల్లంపల్లి ఎమ్మెల్యే చిన్నయ్య, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలను కలిసి తమ సమస్యల పరిష్కారానికి వినతిపత్రం అందజేశారు. సింగరేణిలో 1998 లోనే పదవీ విరమణ వయసు 60 సంవత్సరాలుగా నిర్ణయించడం జరిగిందని ఈ 21 సంవత్సరాల కాలంలో కార్మికుల యొక్క ఆరోగ్య ప్రమాణాలు బాగా మెరుగుపడడం అదేవిధంగా సింగరేణిలో యాంత్రీకరణ ద్వారా పనిభారం సులభతరం అవ్వడం వల్ల సింగరేణి ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 62 సంవత్సరాలు పెంచితే కార్మికులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని వివరించారు.
ఇదీ చదవండి:ఎస్ బీఐ బ్యాంకులో భారీ చోరీ
రాత పరీక్ష ఫలితాలు విడుదలకు వినతి:
అదేవిధంగా సింగరేణిలో 665 బ్యాక్లాగ్ పోస్టుల రాత పరీక్ష ఫలితాలను నిలిపివేయాల్సిందిగా సింగరేణిలో భూములు, ఇళ్లు కోల్పోయిన గిరిజన నిర్వాసితులు హైకోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకున్నారు. సింగరేణి యాజమాన్యం ఇటీవలే గిరిజన నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించిన సందర్భంగా 665 ఎస్టీ బ్యాక్ లాగ్ పోస్టుల రాత పరీక్ష ఫలితాలను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేలను కలిసిన అసోసియేషన్ ప్రతినిధులలో కొత్తగూడెం ఏరియా వైస్ ప్రెసిడెంట్ సంఘాల పద్మారావు , బ్రాంచ్ సెక్రెటరీ ఎనగందుల వెంకటేశ్వర్లు ఫిట్ సెక్రెటరీ శ్రీ శ్రీనివాస్ సెంట్రల్ కమిటీ ఆర్గనైజింగ్ సెక్రటరీ జిమ్మిడి మల్లేష్ , ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ ఫైనాన్స్ మేనేజర్ మధుబాబు, బొట్ల స్వామి మైల రాజేశ్వరరావులు ఉన్నారు.
ఇదీ చదవండి: రుణభారంతో రైతు కుటుంబం సామూహిక ఆత్మహత్య