- తులిప్ గార్డెన్ ను సందర్శించడంటూ ప్రధాని ట్వీట్
- పర్యాటకులను కనువిందు చేస్తున్న 15 లక్షల తులిప్ లు
ప్రకృతి అందాలను ఆస్వాదించాలంటే భారతదేశంలోని భూతల స్వర్గం కశ్మీర్ వెళ్లాల్సిందే. కశ్మీర్ లో విరబూసిన లక్షలాది తులిప్ పూలు కనువిందు చేస్తున్నాయి. సృష్టిలోని అందానికి తామే ప్రతినిధులమన్నట్లు తులిప్ లు పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తులిప్ అందాలను చూడడానికి రండంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. జబర్వాన్ కొండల్లోని తులిప్ పూల వనం వీక్షకుల కోసం ఈరోజు నుంచి ప్రారంభమవుతోంది. తులిప్ గార్డెన్‌కు సంబంధించిన ఫొటోలను ట్విటర్ ఖాతాలో మోడీ షేర్ చేశారు. గార్డెన్‌కు సంబంధించిన విశేషాలను వివరిస్తూ కశ్మీర్ లో పర్యాటక రంగానికి ప్రోత్సహిస్తున్నారు.
Also Read: గుజరాత్ లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ను ప్రారంభించిన మోదీ
తులిప్ గార్డెన్ ను సందర్శించమంటూ ప్రధాని ట్వీట్:
మార్చి 25 జమ్మూ కశ్మీర్‌కు ఎంతో ప్రత్యేకమైన రోజు అంటూ శ్రీనగర్ లోని జబర్వాన్ పర్వత ప్రాంతంలో ఆసియాలోనే అతిపెద్దదైన ఇందిరాగాంధీ మెమోరియల్ తులిప్ గార్డెన్ ను సందర్శించమని ప్రధాని మోదీ కోరారు. తులిప్ గార్డెన్లో 64 రకాలతో 15 లక్షల తులిప్ పూవులు ఉన్నాయంటూ మోదీ ట్వీట్ చేశారు. అధికారికంగా సిరాజ్ బాగ్ గా పిలువబడే ఇందిరాగాంధీ మొమోరియల్ తులిప్ గార్డెన్ ను 2008లో అప్పటి జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రిగా పనిచేసిన గులాంనబీ ఆజాద్ పర్యాటకుల సందర్శనార్థం ప్రారంభించారు. గార్డెన్ పరిసర ప్రాంతాలలో నలు దిక్కులా. తెలుపు, పసుపు, పింక్ రంగులతో పాటు పలు రకాల రంగుల్లో తులిప్ లు కనువిందు చేస్తున్నాయి. ఇది ఆసియాలోనే అతి పెద్ద తులిప్ గార్డెన్లలో ఒకటి కావడం విశేషం.
పర్యాటక రంగానికి ఊతం:
కరోనా వైరస్ ప్రభావం జమ్మూ కాశ్మీర్ పర్యాటక రంగంపై తీవ్రంగా చూపించింది. దీంతో జమ్మూ కాశ్మీర్ పర్యాటక రంగం మళ్ళీ కాశ్మీర్ పర్యాటక రంగానికి ఊపు తెచ్చేవిధంగా ప్రధాని మోదీ ప్రచార కార్యక్రమం చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో తులిప్ గార్డెన్ ను చూసి ప్రకృతి రమణీయతను ఆస్వాదించండి అంటూ మోడీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.
Also Read: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్