Monday, November 25, 2024

అప్రూవల్ లేకుండా పాస్ పుస్తకాల జారీ

  • అప్రూవల్(ARC) లేకుండా ఆన్లైన్ లోఎంట్రీ
  • పోలీసుల అదుపులో నిందితుడు

కంటికి రెప్పలా కాపాడాల్సిన ప్రభుత్వ భూములను ఉన్నత స్థానంలో ఉన్న అధికారులు అక్రమార్కులకు దోచిపెడుతున్నారు. అక్రమ సంపాదనకు అలవాటుపడి ప్రభుత్వ భూమిని అర్హత లేనివారికి దారాదత్తం చేస్తున్నారు. కంప్యూటర్ ఆపరేటర్ సహాయంతో విలువైన భూమిని అక్రమార్కులకు కట్టబెడుతున్నారు. 2018 ఏప్రిల్  లో నెన్నెల తహసీల్దార్ గా పని చేసిన జాడి రాజలింగం ఇచ్చిన ధరఖాస్తు పై నెన్నెల్ మండలం లోని వివిధ లావని పట్టా మరియు ఇతర ప్రభుత్వ భూములకు సంబంధించి తహశీల్దార్ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్ గా పని చేసిన పూదరి నరేశ్ నెన్నెల్ తహసీల్దార్ కార్యాలయంలోని డొంగల్ కీ దుర్వినియోగం చేసి పట్టా చేసినట్లు ఫిర్యాదు చేయగా, నెన్నెల్ పోలీసు స్టేషన్ నందు కేసు నెంబర్. 31/2018 u/s 420, 408 IPC ప్రకారం కేసు నమోదయింది.

ఈ కేసు లో  భారీగా ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయని గుర్తించి బెల్లంపల్లి సీఐని విచారణ  అధికారిగా నియమించారు. ఈ విచారణ లో భాగంగా రెవెన్యూ అధికారులు ఇచ్చిన విచారణ నివేదికను పరిశీలించగా మొత్తం 178 మంధి పాస్ బుక్కుల నుండి 90 మంది రైతులు అర్హులు గాను మరియు 88 మంది అనర్హులు గా తేల్చారు.

Also Read: ఒడిశా లో సింగరేణి అధికారులు

రైతుల వివరాలు:

1. ఖమ్మంపల్లి గ్రామం

మొత్తం పాస్ బుక్స్ 02

మొత్తం భూమి విస్తీర్ణం6.00 ఎకరాలు

2.గ్రామం పేరు : జోగాపుర్

మొత్తం పాస్ బుక్స్ 23

మొత్తం భూమి విస్తీర్ణం57.14 ఎకరాలు

3.గ్రామం పేరు : పుప్పలవానిపేట్

మొత్తం పాస్ బుక్స్ 03

మొత్తం భూమి విస్తీర్ణం7.20 ఎకరాలు

4.గ్రామం పేరు : మన్నెగూడెం

మొత్తం పాస్ బుక్స్ 06

మొత్తం భూమి విస్తీర్ణం20.29 ఎకరాలు

5.గ్రామం పేరు : గొల్లపల్లి

మొత్తం పాస్ బుక్స్ 24

మొత్తం భూమి విస్తీర్ణం45.06 ఎకరాలు

6.గ్రామం పేరు : నెన్నెల

మొత్తం పాస్ బుక్స్ 15

మొత్తం భూమి విస్తీర్ణం45.14 ఎకరాలు

7.గ్రామం పేరు : ఘన్పూర్

మొత్తం పాస్ బుక్స్ 07

మొత్తం భూమి విస్తీర్ణం10.33 ½  ఎకరాలు

8.గ్రామం పేరు : మైలారం

మొత్తం పాస్ బుక్స్ 08

మొత్తం భూమి విస్తీర్ణం16.03 ఎకరాలు

*మొత్తం 8 గ్రామాలు

*మొత్తం పాస్ బుక్స్ 88

*మొత్తం భూమి విస్తీర్ణం207.19½ ఎకరాలు

Also Read:అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత

తహసీల్దార్ కార్యాలయం నెన్నెల్ నందు ప్రైవేట్ కంప్యూటర్ ఆపరేటర్ గా 2010 సంవత్సరం నుండి 2018 మార్చి నెల వరకు పనిచేసిన పూదరి నరేశ్ గౌడ్ ని ఆధుపులోకి తీసుకొని విచారించారు. విచారణ లో  భాగంగా పూదరి నరేశ్ గౌడ్ 2010 జూన్ 5 వ తారీఖు న నెన్నెల్ తహశీల్దార్ కార్యాలయం లొ అప్పటి తహసిల్దార్ గా హరికృష్ణ  పనిచేస్తున్నపుడు లాండ్ రికార్డ్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ద్వారా  రైతులకు పహానీలు ఇవ్వడానికి నెలకు 1500 చొప్పున జీతం తో ఉద్యోగం లో చేరినట్లు తెలిపాడు. ఇదే పద్దతిలో 2012 సంవత్సరం  వరకు భూములకు సంబందించిన పహనీలు లాండ్ రికార్డ్ మేనేజ్ మెంట్ సిస్టమ్ ద్వారా  జారీ చేసినట్లు తెలిపాడు.  

2012 మార్చి నెలనుండి మీ-సేవ మొదలు కావడం తో వెబ్-లాండ్ అనే కొత్త వెబ్ సైట్ లో డొంగల్ కీ ఉపయోగించి డిజిటల్ సైన్ ద్వారా పాస్ పుస్తకాలు జారీ చేసేవారు. ప్రభుత్వ భూములకు సంబందించిన పహనీలు నమోదు చేయాలంటే ఎసైన్ మెంట్ రివ్యూ కమిటీ  ఆమోదించిన సెర్వే నెంబర్ లు మాత్రమే నమోదు  చేయాల్సిఉండగా లాండ్ రికార్డ్స్ ను ఎవరు పట్టించుకోనందున నరేశ్ గౌడ్ పనిచేసిన సమయంలో నెన్నెల్ మండలం తహసీల్దార్లుగా పనిచేసిన హరికృష్ణ, వీరన్న మరియు రాజేశ్వర్ ర్లతో పాటు  వీఆర్వోలుగా పనిచేసిన తిరుపతి, మల్లేశ్, వెంకటస్వామి, రాజన్న, ఇక్బాల్, మెహబూబ్, కరుణాకర్ లు 8 గ్రామాలలోని రైతుల వద్ద అక్రమంగా డబ్బులు తీసుకొని ప్రభుత్వ భూమితో పాటు లవాని పట్టా లకు సంబంధించిన భూములను ఆసైన్ మెంట్ రివ్యూ కమిటీ అప్రూవల్ లేకుండా ఆన్ లైన్ లోఎంట్రీ చేసి వారికి పాస్  బుక్స్ ఇచ్చినట్లు నిందితుడు తెలిపాడు. ప్రతి పాస్ బుక్ పై 1000 నుండి 2000 వరకు డబ్బులు కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసిన నరేశ్ గౌడ్ తీసుకున్నట్లు అంగీకరించాడు.

Also Read: అందరివాడు నల్ల నేల పులి…

ఇతర నిందితుల వివరాలు:

1.పి. హరికృష్ణ, గతం లో నెన్నెల్ తహశీల్దార్ గా పనిచేశాడు.

2.జి.వీరన్న, గతం లో నెన్నెల్ తహశీల్దార్ గా పనిచేశాడు.

3.డి.రాజేశ్వర్, గతం లో నెన్నెల్ తహశీల్దార్ గా పనిచేశాడు.

4.ఐతే తిరుపతి, గతం లో మైలారం గ్రామ వీఆర్వోగా పనిచేసినాడు.

5.రత్నం వెంకటస్వామి, గతం లో కమ్మంపల్లి & జోగాపుర్ గ్రామాల వీఆర్వోగా పనిచేశాడు.

6.కొండగొర్ల రాజన్న,  గతం లో నెన్నెల్ వీఆర్వోగా పనిచేశాడు.

7.సిండే కరుణాకర్, గతం లో నెన్నెల్, ఘన్ పూర్ గ్రామాల వీఆర్వోగా పనిచేశాడు.

8.షేక్ మెహబూబ్, గతం లో మన్నెగూడెం, ఖర్జీ, పుప్పలవానిపేట గ్రామాల వీఆర్వో గా పనిచేశాడు.

9.ఎముర్ల మల్లేశ్, గతం లో నెన్నెల్ గ్రామ వీఆర్వో గా పనిచేశాడు.

10.ఎం.డి ఇక్బాల్, గతం లో ఖమ్మంపల్లి, జోగాపుర్, నెన్నెల్ గ్రామల  వీఆర్వో గా పనిచేశాడు.

కంప్యూటర్ ఆపరేటర్ గా పనిచేసిన పూదరి నరేశ్ గౌడ్ ను పోలీసులు అరెస్టు చేసి విచారిస్తున్నారు.  ఈ కేసు విచారణలో భాగంగా మంచిర్యాల  కలెక్టర్ కార్యాలయం, భూ వివాదం లో చేపట్టిన విచారణ పత్రాలను నెన్నెల్ తహశీల్దార్ కార్యాలయం నుంచి సేకరించి అనర్హులైన రైతులను విచారించారు. ఈ లావాదేవీలలో రెవెన్యూ అధికారుల పాత్రపై ధర్యాప్తు చేస్తున్నారు

Also Read: సెక్యూరిటీ గార్డ్ కు వినతిపత్రం

Muneer MD
Muneer MD
Special Correspondent from Mancherial

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles