* అమ్మాయిలు కూడా ఉచిత శిక్షణలో పెద్ద ఎత్తున పాల్గొనడం గర్వంగా భావిస్తున్నా
మంచిర్యాల: ప్రతి ఒక్కరూ ఉద్యోగ సాధనే లక్ష్యంగా కష్టపడి చదివి ఉద్యోగం సాధించాలని ఎమ్మెల్యే కోనేరు కోనప్ప తనయ కోనేరు ప్రతిమ తెలిపారు. కాగజ్ నగర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కోనేరు ఛారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత టిఆర్టీ టిఈటీ శిక్షణను సందర్శించిన ప్రతిమ అభ్యర్థులనుద్దేశించి ప్రసంగించి అనంతరం వారికి స్వయంగా భోజనం వడ్డించారు.
ఈ సందర్భంగా ప్రతిమక్క మాట్లాడుతూ కోచింగ్ సెంటర్ లో మహిళలు అత్యధిక సంఖ్యలో ఉద్యోగం కోసం శిక్షణ పోందడం చూసి ఒక మహిళగా గర్వపడుతున్నాని, ‘‘మీకు ఏ సమస్య వచ్చినా ఎమ్మెల్యే ఎళ్లవేళలా సహాయసహకారాలు అందిస్తారు,’’ అని మీరంతా కష్టపడి చదివి ఉద్యోగం సాధించాలని తెలిపారు.