- లార్డ్స్ నుంచి సౌతాంప్టన్ కు మార్పు
- జూన్ 18 నుంచి భారత్- న్యూజిలాండ్ టైటిల్ ఫైట్
అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టెస్ట్ లీగ్ చాంపియన్షిప్ ఫైనల్స్ వేదిక ఎట్టకేలకు ఖరారయ్యింది. గతంలో క్రికెట్ మక్కా లార్డ్స్ వేదికగా ఫైనల్స్ జరుగుతుందని ప్రకటించిన ఐసీసీ వేదిక మార్పును పరోక్షంగా బయట పెట్టింది.
భారత్- న్యూజిలాండ్ జట్ల టెస్ట్ లీగ్ టైటిల్ సమరం లార్డ్స్ కు బదులుగా సౌతాంప్టన్ వేదికగా జరుగనున్నట్లు బీసీసీఐ చైర్మన్ సౌరవ్ గంగూలీ తెలిపాడు. ఫైనల్స్ కు రావాల్సిందిగా తనకు ఐసీసీ నుంచి ఆహ్వానం అందిందని, జూన్ 18 నుంచి ఐదురోజులపాటు సౌతాంప్టన్ స్టేడియం బయోబబుల్ వాతావరణంలో నిర్వహిస్తారని గంగూలీ వివరించారు.
Also Read: లిటిల్ మాస్టర్ 50 ఏళ్ల క్రికెట్ జీవితం
సౌరవ్ గంగూలీ ఈ ప్రకటనతో టెస్టు లీగ్ ఫైనల్స్ వేదికపై కొనసాగుతున్న సస్పెన్స్ వీడిపోయింది. ఫైనల్స్ లో పాల్గొనటానికి తాను ఆసక్తితో ఎదురుచూస్తున్నానని తెలిపాడు.2019 నుంచి టెస్టు హోదా పొందిన మొత్తం తొమ్మిదిదేశాల నడుమ లీగ్ ను ఐసీసీ నిర్వహిస్తూ వచ్చింది. విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టు ఆరు సిరీస్ లతో పాటు మొత్తం 12 టెస్టులు నెగ్గి 560 పాయింట్లతో ఫైనల్స్ చేరిన సంగతి తెలిసిందే.లీగ్ టేబుల్ రెండోస్థానంలో నిలిచిన న్యూజిలాండ్ మాత్రం భారత్ తో జరిగిన రెండుమ్యాచ్ ల సిరీస్ ను 2-0తో నెగ్గడం ద్వారా 450 పాయింట్లతో రెండోస్థానంలో నిలవడం ద్వారా ఫైనల్లో అడుగుపెట్టింది.
ఆల్ రౌండర్లకు మరోపేరుగా నిలిచే న్యూజిలాండ్ జట్టుకు ప్రపంచ నంబర్ వన్ బ్యాట్స్ మన్ కేన్ విలియమ్స్ సన్ నాయకత్వం వహిస్తున్నాడు. భారతజట్టుకు మాజీ నంబర్ వన్ ఆటగాడు విరాట్ కొహ్లీ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు.
Also Read: క్రీడారంగంలో మహిళా తరంగాలు