Sunday, December 22, 2024

తూర్పు గోదావరిలో రోడ్డు ప్రమాదం: ఆరుగురు మృతి

రాజమహేంద్రవరం: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ పెండ్లి బృందం ప్రయాణిస్తున్న వ్యాను కొండపైనుంచి కింద పడటంతో ఆరుగురు అక్కడిక్కడే మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయడపడ్డారు. పెళ్లి వేడుకలు ముగించుకుని తిరిగి వెళ్తున్న వ్యాను జిల్లాలోని గోకవరం మండలం తంటికొండ వేకంటేశ్వర స్వామి ఆలయం వద్ద బ్రేక్ ఫెయిల్ కావడంతో కొండపైనుంచి కిందపడింది. ప్రమాద స్థలానికి చేరుకున్న పోలీసులు స్థానికులతోకలిసి సహాయకచర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం ఇవాళ తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో జరిగిందని పోలీసులు తెలిపారు. ఈఘటనలో ఆరుగురు మృతిచెందారని, తీవ్రంగా గాయపడిన నలుగురిని రాజమహేంద్రవరం దవాఖానకు తరలించామని వెల్లడించారు.

రోడ్డు ప్రమాదం ఘటనపై స్పందించిన ఏపి డిప్యూటీ సిఎం, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నాని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మురళీధర్ రెడ్డి, ఎస్.పి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో ఫోన్ లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గాయపడినవారికి సత్వరం వైద్యసేవలు అందించాలని ఆదేశించారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles