హైదరాబాద్ : తెలంగాణ శాసనసభ సమావేశాలకు మంగళవారం నుంచి వరుసగా మూడు రోజులు సలవులని స్పీకర్ ప్రకటించారు. తిరిగి అక్టోబర్ 1న ఉభయసభలూ సమావేశం కానున్నాయి.
గులాబ్ తుపాను, భారీ వర్షాల దృష్ట్యా సమావేశాలకు విరామం ప్రకటించారు. అధికారులు, ఎమ్మెల్యేలు సహాయచర్యల్లో పాల్గొనాల్సినందున ఈ నిర్ణయం తీసుకున్నారు. వర్షాకాల సమావేశాలపై సభాపతి, ప్రొటెం ఛైర్మన్ సభా నాయకుడు, ఆయా పక్షనేతలను సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నారు. సభ్యుల విజ్ఞప్తి మేరకు సభాపతి, ప్రొటెం ఛైర్మన్ ఈ నిర్ణయం తీసుకున్నారు.