పాకిస్తాన్ నుండి పడవల్లో వచ్చి
ముంబైలోని తాజ్ హొటల్లో
తీవ్రవాదులు వినాశం సృష్టించిన రోజు
పగ, ద్వేషాలు పడగలెత్తి కాటేసిన రోజు
ప్రశాంత భారతావని దుఖంలో మునిగిన రోజు
వినాశకారుల యంత్రాంగం ఫలించిన రోజు
వారికి అండగా నిలిచిన పాకి ప్రభుత్వం, సైన్యం
చంకలు గుద్దుకున్న రోజు.
కాలం మారింది.
కుతంత్రానికి కాలం చెల్లింది
దీటుగా సమాధానం చెప్పే పరిస్థితి వచ్చింది
కుట్రలను మొగ్గలోనే తుంచే మంత్రాంగం పెరిగింది
భయంవీడి కాశ్మీరం కుదుట పడుతూంది.
భారతానికి ప్రమంచమంతా వెన్నంటి నిలిచింది
విద్రోహుల భరతం పట్టడం జరుగుతూంది
సుఖ శాంతుల భారతం దగ్గరలోనే ఉంది.
Also read: న్యాయం
Also read: రైలు దిగిన మనిషి
Also read: ఆత్మ నిశ్వాసం
Also read: మా కాలేజ్
Also read: నిర్యాణం