భారతీయ ఆంగ్ల కవులు-5
గొప్ప గురువుల విద్యార్ధి, ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలలో ఆచార్యులైన శివ్ కె కుమార్ ప్రముఖ సాహితీవేత్త. “ఇండియన్ విమెన్” అనే కవితలో నిన్నటి గ్రామీణ భారతంలో స్త్రీ స్థానం గురించి వివరిస్తారు. ఆమె మూడు రకాలుగా బాధ అనుభవిస్తుంది. మొదటిది దరిద్రం. తను మట్టి గోడల ఇంట్లో ఉంటుంది. భర్తపై ఆధార పడిన తనకు ఏ విషయం గురించి కోప్పడే అర్హత లేదు. పురుషాధిక్యానికి లొంగి ఉండాల్సిందే.
Also read: కేకి దారూవాలా
Also read: జయంత్ మహాపాత్ర
రెండవది ఎంతో దూరం వెళ్ళి నీళ్ళు తెచ్చుకోవలసి రావడం. తన చర్మం మాడుతున్నా బావి దగ్గర ఖాళీ కుండలా తనవంతు వచ్చే వరకు ఆగి నీళ్ళు చేదుకోవడం, చికటిపడే వరకు భర్త కోసం ఎదురు చూడడం తప్పదు. మూడవది తన తోడమీది పచ్చబొట్టు. తాను ఎవరికీ స్వంతమో తెలియచేసే పశువుల మీద వేసే ముద్ర లాంటిది. కిమ్మనకుండా భర్త కోరిక తీర్చడానికే తను అంకితం. చదువు, ఆర్ధిక స్వాతంత్ర్యం లేని స్త్రీ మనసు, మెదడులేని ఓటికుండలా సమాజంలో చూడబడిన విషయాన్ని చక్కగా వివరించారు కవి.
Also read: నిస్సిం ఎజేకియల్
Also read: ఎకె రామానుజం