ఎవరికి వారే ఏకాంత ద్వీపాలై , స్పర్శా తీరానికి చేరకుండా కరోనా శిల తాకిడి తో ముక్కలైన శకలాలై , అనివార్య విషాద అగమ్య గోచర సంచార రోదనలై, సూక్ష్మ క్రిమి స్ధూల దుఃఖమై దిగబడుతుంటే కళ్ళ ముందే కాయాలు అంతమైతే కరాళ దృశ్యాల సృష్టి కర్త ఎవరో ? నమ్ముకున్న నాయకులే నరకానికి రహదారులైతే వైద్యమూ విపణి వస్తువై ప్రాణాల పణం పెట్టే జూదం నిత్యం ప్రవహించే నిర్వేదం ! ముందు చూపు లేని నేతలకు మందుచూపూ,జాతీయ జాతరైన ఎన్నికలూ,మోళీల కుంభమేళాలూ సజావుగా సాగిపోతాయి వలసలు వల్లకాటిలో ఆగిపోతాయి ! వాయువే రాహువైనప్పుడు ఆయువు దూరమవడం లో ఆశ్చర్యమేముంది ? దేవుడా రక్షించు నా దేశాన్ని పాము పారిపోయాక గాలి లో కర్ర సాము చేసే ఎర్ర స్వాముల నుండి ! |
Very nice
Reflections of the current situations, a nice poetry for the contemporary political scenario.
Awesome