- బీజేపీకి 43 -48
- కాంగ్రెస్ కి 38 – 43
హైదరాబాద్ : హైదరాబాద్ కు చెందిన పీపుల్స్ పల్స్ నిర్వహించిన పోస్ట్ పోల్ సర్వేలో ఏ రాజకీయ పార్టీకి పూర్తి మెజారిటీ వచ్చే అవకాశం లేదు. డాక్టర్ సజ్జన్ కుమార్ నాయకత్వంలో జరిగిన ఈ సర్వే ఫలితాలు ఎగ్జిట్ పోల్స్ తర్వాత అధ్యయనం చేసిన తర్వాత లెక్కగట్టినవి. అస్సాంలో హంగ్ అసెంబ్లీకి ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఏ పార్టీ అయినా అస్సాంలో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యాలంటే 64 సీట్స్ పొందాలి . ఈ సీట్స్ పొందే అవకాశం ఏ ఒక్క రాజకీయ పార్టీకి కనిపించడం లేదు. ఇప్పటి వరకూ అధికారంలో ఉన్న బీజేపీ పూర్తి మెజారిటీ సాధించే సూచనలు కనిపించ లేదు. అట్లాగని ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ కూడా మెజారిటీ స్థానాలు గెలుచుకునే అవకాశాలు కనిపించడం లేదు. హంగ్ అసెంబ్లీ రావచ్చునని ఎగ్జిట్ పోల్ ఫలితాలు సూచిస్తున్నాయి.
అతిపెద్ద పార్టీగా బీజేపీ పార్టీ అవతరించే అవకాశం మాత్రం కనిపిస్తోంది. కాంగ్రెస్ రెండవ స్థానంలో నిలిచినప్పటికీ మొదటి స్థానం సాధించే బీజేపీ కంటే పెద్దగా వెనుకబడి ఉండదు.
పీపుల్స్ పల్స్ నిర్వహించిన పోస్ట్ పోల్ సర్వే ప్రకారం బీజేపీ పార్టీకి 43 నుండి 48 సీట్లు , కాంగ్రెస్ పార్టీకి 38 నుండి 43 సీట్స్ , ఏఐయూడీ యఫ్ కి 16 నుండి 19, బిపిఎఫ్ కు 7 సీట్లు , ఏజిపి కి 7 నుండి 9, యుపీపీఎల్ కు 4 నుండి 5 మిగిలిన 11 సీట్స్ ఇతరులు గెలుచుకొనే అవకాశం వుంది ….
పీపుల్స్ పల్స్ నిర్వహించిన పోస్ట్ పోల్ సర్వే ప్రకారం మార్జిన్ ఆఫ్ ఎర్రర్ ప్లస్ ఆర్ మైనస్ 5 శాతం . మే రెండో తేదీన వెలువడే అసలైన ఫలితాలను సూచించడానికే ఈ ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఉపయోగించుకోవాలి. ఎగ్జిట్ పోల్ ఫలితాలు అయిదు శాతం ఇటూ అటూ అయ్యే అవకాశాలు ఉన్నాయని గుర్తించాలి.
అస్సాంలో ఇప్పటికే అన్ని రాజకీయ పార్టీలు హోటల్ , రిసార్ట్స్ క్యాంపు రాజకీయాలకు తెర లేపాయి. 2 మే అస్సాం ఎన్నికలు ఫలితాలు వెలువడిన తరువాత రాజకీయ పార్టీలు పోస్ట్ పోల్ సమీకరణలు , రాష్ట్ర గవర్నర్ నిర్ణయం తదితర అంశాలు అస్సాం రాష్ట్రంలో ప్రభుత్వం ఎవరు ఏర్పాటు చేస్తారు అన్న అంశం పై ఆధార పడివుంటుంది .కేంద్రంలోనూ, అస్సాంలో నూ అధికారంలో ఉన్నబీజేపీకి ఈ విషయంలో ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అస్సాంలో ప్రభుత్వం ఏర్పాటులో మూడవ ఫ్రంట్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది.