Sunday, November 24, 2024

ప్రొ. మాడభూషి శ్రీధర్ ఆచార్యకు ఎల్ఎల్ డీ పట్టా

  • సమాచారహక్కుకూ, గోప్యతహక్కు మద్య వైరుధ్యంపైన పరిశోధన
  • సుప్రీంకోర్టు ఉత్తర్వు సమాచార హక్కు చట్టాన్ని ఎట్లా నిర్వీర్యం చేసిందో నిరూపించిన న్యాయకోవిదుడు

విశాఖపట్టణం: ప్రొఫెపర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులకు ఎల్. ఎల్. డీ (న్యాయశాస్త్రంలో డాక్టర్ ఆఫ్ లిరేచర్ తో సమానం) దామోదరం సంజీవయ్య జాతీయ న్యాయవిశ్వవిద్యాలయం (విశాఖ పట్నం)ఇటీవల స్నాతకోత్సవంలో ప్రదానం చేసింది. ఇది పీహెచ్ డీ అనంతర  పరిశోధన చేసినవాబరికి అరుదుగా ఇచ్చే అత్యున్నత పరిగణన (పట్టా). సుప్రీంకోర్టు జారీ చేసిన ఒక ఆదేశం (ఆర్డర్) దేశవ్యాప్తంగా సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద సమాచారం కోసం  దరఖాస్తు చేసే లక్షలాదిమందినీ, దరఖాస్తు చేసుకున్నా తమకు న్యాయం జరగలేదని అప్పీలు చేసుకునే వేలాది మందినీ ఏ విధంగా విఫలం చేసి ఓటమిపాలు చేస్తున్నదో ప్రొఫెసర్ మాడభూషి శ్రీధరాచార్యులు పరిశోధన చేసి, అది ఏ విధంగా న్యాయం కాదో  నిరూపించారు.  గిరిష్ రామచంద్ర దేశపాండే కేసు లో దేశంలోని అత్యున్నత న్యాయస్థానం తీర్పు సమాచార హక్కును ఏ విధంగా హరిస్తున్నదో స్పష్టం చేశారు.

“Judicial Legislation on Privacy versus Parliamentary Enactment on Right to Information: Its impact on the Governance by the Executive in India, (With special reference to Section 8(1)(j) of Right to Information Act and judgment of Supreme Court in Girish Ramachandra Deshpande), పార్లమెంట్చేసిన ఆర్టీఐ చట్టానికి న్యాయస్థానాలు ప్రత్యామ్నాయంగా రచించిన తీర్పురూప చట్టానికి మధ్య వైరుధ్యం, రాజ్యాంగ పాలనపైన దాని ప్రభావం, (ఆర్టీఐ చట్టం సెక్షన్ 8(1)(జె), గిరీష్ దేశ్ పాండే కేసులో తీర్పు గురించి ప్రత్యేక  పరిశీలనతో) అనే అంశం పైన ఆయన పరిశోధనను ఎల్ ఎల్ డి డిగ్రీ ప్రదానానికి అర్హమైందని డిఎస్ ఎన్ ఎల్ యు బహిరంగ సెమినార్ లో నిర్ధారించింది.

ప్రైవసీపైన న్యాయపరమైన తీర్పు, సమాచారహక్కుపైన పార్లమెంటు చేసిన చట్టం మధ్య భారత దేశంలో పరిపాలనా వ్యవస్థ ఏ విధంగా నలుగుతున్నదో, ప్రభావితం అవుతున్నదో సాధికారికంగా నిరూపించారు. ఈ పరిశోధనకి గుర్తింపుగా దామోదరం సంజీవయ్య నేషనల్ లా యూనివర్శిటీ మాడభూషి శ్రీధర్ ఆచార్యులకు న్యాయశాస్త్ర పరిశోధనలో అత్యున్నత స్థాయి ఎల్ ఎల్ డి పట్టాని ప్రదానం చేసింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles